‘90స్’ వెబ్ సిరీస్‌తో దర్శకుడిగా గుర్తింపును తెచ్చుకున్న ఆదిత్య హాసన్.. ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా రూపొందించిన చిత్రం ‘ఎపిక్– ఫస్ట్ సెమిస్టర్’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆదిత్య హాసన్ ఇలా మాట్లాడారు.
‘విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు. అక్కడ చదువుకున్న వ్యక్తిగా నాకు అవి తెలుసు కనుక.. రియల్ ఇన్సిడెంట్స్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించా. ‘90స్’ సిరీస్‌లోని తమ్ముడి పాత్ర పెద్దయ్యాక అతని లైఫ్‌లో జరిగే కథ ఇది. దీని ముగింపు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల కోణంలోనో, దర్శకుడి కోణంలోనో కాకుండా ఆ కథకు ఎలాంటి ముగింపు అవసరమో, అలాంటి క్లైమాక్స్ చూపించాం. ప్రతి ఒక్కరికీ అది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నిర్మాత నాగవంశీ సజెస్ట్ చేయడంతో ‘బేబీ’ హిట్ పెయిర్‌ను తీసుకున్నాం.
ఆనంద్, వైష్ణవి తమ పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. ఇదొక గొప్ప కథ అని చెప్పను. హైదరాబాద్ నుంచి యూకే వెళ్లిన ఓ యువకుడు అక్కడి అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది కథ. 90స్ ఎలాగైతే సహజంగా ఉంటుందో, ‘ఎపిక్’ కూడా అంతే సహజంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు గుర్తుండిపోతాయి. ‘90స్’ సిరీస్‌లోని అన్న జీవితాన్ని, అక్క జీవితాన్ని కూడా వేర్వేరు కథలుగా చూపించే ఆలోచన ఉంది” అని చెప్పాడు.‘విదేశాల్లో చదువుకునే విద్యార్థుల గురించి, అక్కడి బంధాల గురించి ఎక్కువగా సినిమాలు రాలేదు.
అక్కడ చదువుకున్న వ్యక్తిగా నాకు అవి తెలుసు కనుక.. రియల్ ఇన్సిడెంట్స్ ఇన్‌స్పిరేషన్‌తో ఈ చిత్రాన్ని రూపొందించా. ‘90స్’ సిరీస్‌లోని తమ్ముడి పాత్ర పెద్దయ్యాక అతని లైఫ్‌లో జరిగే కథ ఇది. దీని ముగింపు కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల కోణంలోనో, దర్శకుడి కోణంలోనో కాకుండా ఆ కథకు ఎలాంటి ముగింపు అవసరమో, అలాంటి క్లైమాక్స్ చూపించాం. ప్రతి ఒక్కరికీ అది కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నిర్మాత నాగవంశీ సజెస్ట్ చేయడంతో ‘బేబీ’ హిట్ పెయిర్‌ను తీసుకున్నాం. ఆనంద్, వైష్ణవి తమ పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు.
ఇదొక గొప్ప కథ అని చెప్పను. హైదరాబాద్ నుంచి యూకే వెళ్లిన ఓ యువకుడు అక్కడి అమ్మాయితో ప్రేమలో పడతాడు. చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది కథ. 90స్ ఎలాగైతే సహజంగా ఉంటుందో, ‘ఎపిక్’ కూడా అంతే సహజంగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు గుర్తుండిపోతాయి. ‘90స్’ సిరీస్‌లోని అన్న జీవితాన్ని, అక్క జీవితాన్ని కూడా వేర్వేరు కథలుగా చూపించే ఆలోచన ఉంది” అని చెప్పాడు.
