వేగంగా వ్యాపిస్తోన్న కరోనా కొత్త వేరియంట్.. అప్రమత్తంగా ఉండండి

వేగంగా వ్యాపిస్తోన్న కరోనా కొత్త వేరియంట్.. అప్రమత్తంగా ఉండండి

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించటం లేదు. దీని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు మరోసారి పిడుగు లాంటి వార్త అందుతోంది. యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) అంతటా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన EG.5.1 వేగంగా వ్యాపిస్తోందట. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ కొత్త సబ్ వేరియంట్‌కు 'ఎరిక్' అని నామకరణం చేశారు. ప్రతి 7 కొత్త కరోనా కేసుల్లో ఒక 'ఎరిక్' వేరియంట్ ఉంటోందని, కట్టడికి చర్యలు చేపడుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. గత వారం రోజులో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా దాదాపు 5.4 శాతం మందికి కోవిడ్-19కి పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా యూరప్, ఆసియాతో పాటు ఉత్తర అమెరికాలో కూడా ఎరిస్ తన ఉనికిని చాటుతోన్నట్లు వార్తలొస్తున్నాయి.