నూతన రిజిస్ట్రేషన్ విధానంలో లోపాలు

నూతన రిజిస్ట్రేషన్ విధానంలో లోపాలు

నూతన రిజిస్ట్రేషన్ విధానంలో చాలా లోపాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అంతేకాదు దీని కారణంగా గత ఆరు నెలలుగా  నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. నాడు ఆంగ్లేయులు జుట్టు పన్ను వసూలు చేస్తే.. నేడు రిజిస్ట్రేషన్ల పేరుతో సీఎం కేసీఆర్ పన్ను వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  RC బిల్డింగ్ కు… రేకుల షెడ్డుకు ఒకే విధానమైన పన్ను వసూలు చేయడం సామాన్యుడిపై భారం పడే విధంగా ఉందన్నారు. LRS విధానం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉందన్న జీవన్ రెడ్డి… రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో గిఫ్ట్ డీడ్,  వారసత్వ మోటివేషన్ విధానాల్లో లోపాలున్నాయన్నారు. కరోనా తో దెబ్బతిన్న నిర్మాణ రంగం.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయి మరింత దెబ్బతిందన్నారు.

సన్న రకాల వడ్లు సాగు చేయమని చెప్పి అన్నదాతలను సీఎం నిండా ముంచారని ఆరోపించారు జీవన్ రెడ్డి. GHMC ఎన్నికల ఫలితాలు చూసైనా సీఎంకు బుద్ధి వస్తుందనుకున్నా…కానీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. భవిష్యత్తులో వివాదాలకు కారణం అయ్యే విధంగా ఉన్న ధరణిలోని  వెబ్ పోర్టర్ లోని కొన్ని అంశాలను తొలగించాలన్నారు. డాక్యుమెంట్స్ ఇబ్బందులు లేకుండా పూర్తిగా సరి చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని డిమాండ్ చేశారు.