E20 పెట్రోల్ వాడుతున్నారా..? ఐతే మీ కారు బైక్ ఇంజన్ ఖతం.. జేబులకు చిల్లు..!!

E20 పెట్రోల్ వాడుతున్నారా..? ఐతే మీ కారు బైక్ ఇంజన్ ఖతం.. జేబులకు చిల్లు..!!

భారత్ ఎక్కువగా తన ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. మెుత్తం దేశీయ అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారా తీర్చబడుతుండటంతో ఈ ఖర్చును తగ్గించుకునేందుకు బయో ఫ్యూయెల్ వినియోగాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగా ఇ20 అంటే ఇంధనంలో 20 శాతం ఇథనాల్ మిగిలిన 80 శాతం గ్యాసొలిన్ మిక్సింగ్ జరుగుతోంది. అయితే మార్కెట్లో ఇ20 ఫ్యూయెల్ వాడకం వాహనదారుల జేబులకు ఎలా చిల్లు పెడుతుందనే విషయాన్ని ఆర్థిక సలహాదారు లోవిష్ ఆనంద్ చెబుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇ20 ఆయిల్ వాడకం భారతదేశానికి దిగుమతి ఖర్చులను రూ.లక్ష 20వేల కోట్లను తగ్గిస్తూ కర్భన ఉద్గారాలు 626 లక్షల మెట్రిక్ టన్నులు తగ్గుతాయి. కానీ ఇది వాహన యజమానులపై పెను భారాన్ని మోపటంతో పాటు లక్షల సంఖ్యలో ఇంజన్లు మూగబోయేలా చేసే ప్రమాదం గురించి తెలుసుకుందాం.. 

2023కు ముందు కొన్న వాహనాలు ఇథనాల్ ఆధారిత ఇంధనం వాడకం కోసం తీసుకొచ్చినవి కాదు. వీటిలో ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న ఇ20 పెట్రోల్ లేదా డీజిల్ వాడటం ద్వారా ఫ్యూయెల్ లైన్ తుప్పు, రబ్బరు సీల్ క్షీణత, ఇతర పార్ట్స్ పాడవటానికి కారణం అవుతుంది ఎందుకంటే ఇథనాల్ హైగ్రోస్కోపిక్ కావటం వల్ల తేమను గ్రహిస్తుందని తేలింది. 

పాత వాహనాలను ఇ20 ఇథనాల్ పెట్రోల్ లేదా డీజిల్ వాడకానికి అనువైనవిగా మార్చటానికి ద్విచక్రవాహనదారులు రూ.25వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలియగా.. నాలుగు చక్రాల వాహనాలు రూ.లక్ష 20వేల వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. వాస్తవంగా ఇది సగటు భారతీయ కుటుంబాలపై నేరుగా పడే భారం అని ఆనంద్ పేర్కొన్నారు. పైగా ఇథనాల్ మిక్స్ చేసిన బయో ఫ్యూయెల్ 30 శాతం తక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుందని.. ఇది వాహనాల మైలేజీని భారీగా తగ్గిస్తుంది.

హీరో మోటార్స్ సంస్థ తన ఇ20 వాహనాల మైలేజీ 6 శాతం తగ్గిందని చెప్పగా.. మారుతీ కూడా కార్లలో టార్క్ తగ్గిందని, ఇంజన్ గొట్టాలు దెబ్బతిన్నట్లు చెప్పింది. బ్రెజిల్ దేశం ఇథనాల్ ఆధారిత వాహనాలకు మారటానికి 40 ఏళ్ల ప్రయాణం చేసి.. ఈ క్రమంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను నిర్మించుకుంది. కానీ భారత్ మాత్రం హడావిడిగా ఇథనాల్ వాడకంతో 5 ఏళ్లలో రావటం.. వాహనదారులపై పెను భారానికి కారణంగా మారుతోంది. రానున్న రోజుల్లో ఇ27 ఇంధనాన్ని భారత్ తీసుకురావాలని చూస్తోంది. ఇది వస్తే ప్రస్తుతం ఉన్న వాహనాలు మార్పులకు గురికావాల్సిందే లేదంటే ఇంజన్లు పనిచేయటం మానేసి మెురాయిస్తాయి. పైగా మైలేజీలు భారీగా పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోపక్క కంపెనీలు వీటికి వారెంటీలు ఇస్తాయా లేవా అనేది మరో పెద్ద సమస్య.