ఇథియోపియోలో హేలి గుబ్బి అగ్నిపర్వతం బద్దలైంది.. ఎగిసిపడుతున్న బూడిద పొగ.. వేల కిలోమీటర్ల ప్రయాణం.. బూడిద మేఘాలు ఇప్పుడు భారత్ ను కమ్మేశాయి. కమ్ముకొస్తున్న బూడిద మేఘాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, దేశా రాజధాని ఢిల్లీలో గందరగోళం సృష్టిస్తోంది.
పది వేల సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద విస్ఫోటనం. దేశమంతటా విమానాల రద్దుకు అత్యవసర పరిస్థితి ప్రకటించిన డీజీసీఐ. పలు విమానయాన సంస్థలు ఇప్పటికే తమ విమానానలను రద్దు చేసుకున్నాయి. మిడిల్ ఈస్ట్, యూరప్ వైపు వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇథియోపియోలో హేలీ గుబ్బి అగ్ని పర్వతం బద్దలైంది.. ఫలితంగా భారీ ఎత్తున బూడిద పొగ వ్యాపించింది.. ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఓమెన్ గుండా వేల కిలోమీటర్లు ప్రయాణించి బూడిద మేఘాలు ఇండియాలోకి ప్రవేశించాయి. ఆ పొగమంచు 15వేల నుంచి 45వేల అడుగుల ఎత్తులో గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ..బూడిద, సల్ఫర్ డయాక్సైడ్ ,చిన్ని చిన్న్ గాజు ,రాతి కణాలను మోసుకెళ్తుండంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విమానాశ్రయాల్లో రన్ వేపై ఈ బూడిద పేరుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాలకు వెళ్లే విమానాలను రద్దు చేశారు.
ఆకాశంలో బూడిద ప్రభావంతో విమానాలను రద్దు చేసుకోవాలని DGCA విమాన సంస్థలను ఆదేశించింది. దీంతో అకాసా ఎయిర్, ఇండిగో, కెఎల్‌ఎం విమానాలను రద్దు చేశాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, యూరప్‌కు వెళ్లే మార్గాలు ప్రభావితమయ్యాయి. ఆకాశంలో బూడిద కారణంగా జెడ్డా, కువైట్ ,అబుదాబికి బయలుదేరే మా విమానాలు రద్దు చేశామని ఆయా ఎయిర్ లైన్స్ ప్రకటించాయి.
సోమవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఢిల్లీ, జైపూర్ వైపు బూడిద మేఘాలు కదులుతున్నట్లు గుర్తించారు అధికారు. జామ్ నగర్ సమీపంలో బూడిదను గుర్తించారు. మంగళవారం బూడిద మేఘాలు విస్తరించడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది డీజీసీఏ.
