రష్యా తీరుతో యూరప్ కు ప్రమాదం

రష్యా తీరుతో యూరప్ కు ప్రమాదం

‘రైసినా డైలాగ్’లో ఈయూ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్ లేయెన్ 

న్యూఢిల్లీ: రష్యా హింసాత్మక ధోరణిపై మన స్పందనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్ లేయెన్ అన్నారు. ఢిల్లీలో సోమవారం మూడు రోజుల  7వ  'రైసినా డైలాగ్' సదస్సు ప్రారంభ సమావేశంలో ఆమె మాట్లాడారు. రష్యా తీరు యూరప్ కు  ప్రమాదంగా మారిందన్నారు. ఉక్రెయిన్ కు తగిన మద్దతు ఇస్తామని, రష్యాపై ఆంక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. ఈయూ, ఇండియా మధ్య వ్యాపార సంబంధాలు బలోపేతం కావాలన్నారు. రైసినా డైలాగ్ సదస్సుకు చీఫ్​ గెస్ట్ గా వచ్చిన ఉర్సులకు ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి  జైశంకర్ స్వాగతం పలికారు. సమావేశంలో స్వీడన్ మాజీ పీఎం కార్ల్ బిల్త్, మాల్దీవుల మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ నషీద్, కెనడా, ఆస్ట్రేలియా మాజీ పీఎంలు హార్పర్, ఆంటొని అబాట్, పలు దేశాల అధికారులు పాల్గొన్నారు.