స్విగ్గీ నుంచి ప్రతీ సెకన్​కి 2 బిర్యానీ ఆర్డర్లు

స్విగ్గీ నుంచి ప్రతీ సెకన్​కి 2 బిర్యానీ ఆర్డర్లు

ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చిన దగ్గరనుంచి జనాలు ఏదికావాలన్నా ఇంటికి ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు. డిజర్ట్స్, స్నాక్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నా బిర్యాని తినడానికే ఎగబడుతున్నారు. తమకు వచ్చిన ఆర్డర్స్ లో బిర్యానీయే నెంబర్ వన్ స్థానంలో ఉందని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా వెల్లడించింది.  2022 సంవత్సరానికి గాను స్విగ్గీకి వచ్చిన వార్షిక ఆర్డర్ల నివేదిక 7వ ఎడిషన్ ను స్విగ్గీ విడుదల చేసింది. ఆ నివేదికలో దేశ వ్యాప్తంగా ప్రతి సెకన్ కి 2, నిమిషానికి 137 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నాయట. 

ఈ లెక్కన బిర్యానీ తర్వాత వరుసన మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ బిర్యానీ ఉన్నాయి. విదేశీ వంటకాల్లో ఇటాలియన్ పాస్తాకి డిమాండ్ ఎక్కువ. తర్వాత పిజ్జా ఉన్నాయి. స్నాక్స్ నుంచి టాప్ ప్లేస్ లో సమోసా నిలిచింది. పాప్ కార్న్, పావ్ బాజీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. స్వీట్లలో టాప్ గులబ్ జామ్, తర్వాత రస్ మలాయ్, చాకోలావా కేక్స్ ఉన్నాయి. 35 లక్షల కస్టమర్లు డెలివరీ ఏజెంట్లకు టిప్ గా రూ.53 కోట్లు ఇచ్చారు. అయితే, గతేడాది న్యూ ఇయర్ వేడుకల్లో కూడా ఆన్‌లైన్‌ లో బిర్యానీనే  ఎక్కువ ఆర్డర్ పెట్టి రికార్డ్ కొట్టారు.