ప్రతి ఓటరుకూ ఎన్యూమరేషన్ ఫారం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి

ప్రతి ఓటరుకూ ఎన్యూమరేషన్ ఫారం : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి
  •    శేరిలింగంపల్లిలో అధికారులతో కలిసి ‘సర్’ ప్రక్రియ పరిశీలన

గచ్చిబౌలి, వెలుగు: ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్  ఫారం అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్​రెడ్డి సూచించారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సాయం అందించాలని, నిర్ణీత గడువులోగా డిజిటైజేషన్  కంప్లీట్​ చేయాలని ఆదేశించారు. ఫారం సమర్పించని వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం జరుగుతుందని తెలిపారు. 

ఆదివారం రంగారెడ్డి కలెక్టర్  సి.నారాయణ రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గుల్మోహర్ పార్క్  కాలనీ, మై హోమ్ మంగళ గేటెడ్ కమ్యూనిటీలను సందర్శించి ఎన్యూమరేషన్  ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్ ను పరిశీలించారు. అనంతరం ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్‌‌‌‌వైజర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. శేరిలింగంపల్లి ఈఆర్వో​అమిత్​ నారాయణ పాల్గొన్నారు.