
బీహార్ మూడు దశల ఎన్నికల సమరం కొనసాగుతుంది. ఇప్పటికే రెండు దశల ఎన్నికల పోలింగ్ ముగియగ..మూడో దశ 78అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ నవంబర్ 7న జరగనుంది.
ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల ముఖ్యనేతలు, అభ్యర్ధులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీహార్ అరియా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ పై విమర్శలు చేశారు. బీహార్ లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లలో సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అంటే ఈవీఎం కాదని ఎంవీఎం (మోడీ ఓటింగ్ మెషిన్ ) అని అన్నారు. ఈ ఎన్నికల్లో తమ అలయన్స్ విజయం సాధిస్తుందని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు తాను ఎంవీఎం కు బయపడనని అన్నారు.
నిజానికి నిజం..,న్యాయానికి న్యాయం. మోడీ ఆలోచనల్ని, వ్యతిరేకిస్తూ ఓడిపోవాలని కోరుకుంటున్నాం. నితీష్, మోడీలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన యువతకు ఉద్యోగాలు కల్పించి, బీహార్ ను పూర్తిగా మార్చేస్తామని హామీ ఇవ్వడంపై రాహుల్ స్పందించారు.
బీహార్ యువత బహిరంగ సభల్లో గతంలో నితీష్ నిరుద్యోగులకు ఉపాది అవకాశాల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాటి గురించి అడిగిన యువతను బెదిరిస్తున్నారు. కొడుతున్నారని రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.