గాంధీభవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

గాంధీభవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలు

ఇందిరాగాంధీ కుమారునిగా.. జవహర్ లాల్ నెహ్రూ మనువడిగా రాజీవ్ గాంధీ ఎంతో ఖ్యాతి గడించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా 40 ఏళ్ల వయసులోనే రాజీవ్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని ఆయన అన్నారు. ఈ రోజు రాజీవ్ గాంధీ 76వ జన్మదినం. ఆ వేడుకలను గాంధీభవన్లో నిర్వహించారు. ఆ వేడుకలలో పాల్గొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…‘రాజీవ్ గాంధీ దేశ పాలనపై తన చెరగని ముద్ర వేశారు. దేశ నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం కల్పించడం కోసం 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారు.
దేశ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాముఖ్యతను గుర్తించి ప్రోత్సహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 72వ రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల వాడకంలో భారతదేశం నెంబర్ వన్ గా ఉండడానికి ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయే కారణం. ప్రపంచంలో భారతదేశం అగ్రగామిగా ఉండాలని ఆయన కోరుకున్నారు. రాజీవ్ గాంధీ మరియు ఆయన కుటుంబం ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేశారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారు. రాజీవ్ గాంధీ భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. చిన్న వయసులోనే ఆయన మనకు దూరమయ్యారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు ఈ దేశానికి చేసిన సేవలను మోడీ ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంది. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు దేశం కోసం, సమాజం కోసం సేవ చేస్తుంటే.. వారి చరిత్రను తొక్కి పెట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. హోంమంత్రి అమిత్ షా కాశ్మీర్ విషయంలో మాట్లాడుతూ.. నెహ్రూను తక్కువ చేసి మాట్లాడారు. మేమంతా రాజీవ్ గాంధీ బాటలో నడుస్తూ.. వచ్చే జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం’ అని ఆయన అన్నారు.

For More News..

మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ

కొన్ని కులాలే ప్రజాస్వామ్యాన్ని శాసిస్తున్నాయి

గన్ పార్క్ వద్ద బీజేపీ మహిళా మోర్చా నిరసన