
తండ్రి మాజీ ఐపీఎస్..తల్లి పొలిటీషియన్..మాజీ మంత్రి..డబ్బుకు, హోదా కు ఎలాంటి కొదవలేదు..అయినా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు..ఆత్మహత్యకు ముందు అతను ఓ వీడియో రికార్డు చేశాడు. ఆ వీడియోతో అతని బలవన్మరణానికి సంబధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొడుకు ఆత్మహత్యకు రికార్డెడ్ ఎవిడెన్స్లభించడంతో పేరెంట్స్ తో సహా మరో ఇద్దరిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకి వెళితే..
పంజాబ్‌కు చెందిన 33 ఏళ్ల అఖిల్అక్తర్.. అతని తండ్రి పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తాఫా, తల్లి మాజీ మంత్రి రజియా సుల్తానా.. డబ్బు, హోదా అన్ని ఉన్నాయి.. అయినా మానసికంగా బాగా కుంగిపోయాడు. గత గురువారం పంచకులలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆపస్మారక స్థితిలో అక్తర్ ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. డ్రగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్లే అక్తర్ చనిపోయాడని నిర్ధారించారు. అయితే అఖిల్ అక్తర్చనిపోయే ముందు రికార్డు చేసిన వీడియో లభించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు పంజాబ్ లో సంచలనం సృష్టించిన ఈ కేసు అఖిల్ రికార్డ్ చేసిన వీడియో,కుటుంబ స్నేహితుడి సాక్ష్యాతో నాటకీయ మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకున్న అక్తర్ తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నట్లు తేలింది. అక్తర్ కు ప్రాణభయం ఉన్నట్లు వీడియో పరిశీలన తర్వాత పోలీసులు నిర్దారణకు వచ్చారు. అక్తర్ తండ్రి, తల్లీ, అతని భార్య, సోదరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వీడియోలో అఖిల్ అక్తర్ ఏం చెప్పాడు?
అగస్టులో అక్తర్ రికార్డ్ చేసిన వీడియోలో తన తండ్రి ,భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు, తండ్రితో అక్రమ సంబంధం ఉంది..నేను చాలా ఒత్తిడికి గురవుతున్నాను.. మానసికంగా కుంగిపోయాను.ఏమి చేయాలో తెలియడం లేదు.. ఇందుకు తన సోదరి, తల్లి కూడా సహకరిస్తున్నారని ఆరోపించాడు. నన్ను తప్పుడు కేసులో ఇరికించి జైలులోని చంపేందుకు కుట్ర చేస్తున్నారని.. తాను పెళ్లి చేసుకోక ముందే తన భార్య, తండ్రికి తెలుసని అన్నాడు. తాను డ్రగ్స్ తీసుకోకుండా కంట్రోల్ ఉన్నా.. కూడా రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపించారని అక్తర్స్వయంగా రికార్డు చేసిన వీడియోలో చెప్పడం ఈ కేసులో కీలక ఎవిడెన్స్ గా మారింది.
FIR లో ఏముంది..
FIR ప్రకారం.. అఖిత్ అక్తర్ ఆత్మహత్యకు అతని పేరెంట్స్ అయిన పంజాబ్ మాజీ DGP మహ్మద్ ముస్తఫా, మాజీ మంత్రి రజియా సుల్తానాతోపాటు అతని సోదరి కూడా కారణమని ఫిర్యాదు చేశారు. ఇది అక్తర్ స్వయంగా రికార్డు చేసిన వీడియోలో సాక్ష్యం అని మలేర్ కోట్లకు చెందిన షంషుద్దీన్ చౌదరి ఫిర్యాదు చేశారు. తన తండ్రి, భార్య అక్రమ సంబంధం కలిగి ఉన్నారని ఆరోపిస్తూ అక్తర్ వీడియోలో చెప్పారని ఫిర్యాదులో వెల్లడించారు.
►ALSO READ | రాష్ట్రపతి భవన్ సమీపంలో అగ్ని ప్రమాదం.. రెండంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు
దానికి తల్లి, సోదరి సపోర్టు చేస్తుందని,తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని అఖిల్ భయపడుతూ వీడియో రికార్డు చేసినట్లు పోలీసులకు తెలిపారు షంషుద్దీన్ చౌదరి. అఖిల్ వీడియో, డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు ,పోస్ట్‌మార్టం ఫలితాలను పరిశీలించి సమగ్రమైనదర్యాప్తు చేయాలని అధికారులను కోరారు. ఫిర్యాదు తర్వాత MDC పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు పోలీసులు.