
సికింద్రాబాద్, వెలుగు: గంజాయితో తయారు చేసిన హాషిష్ స్టిక్స్‌ను తీసుకెళ్తున్న వ్యక్తిని ఎక్సైజ్స్పెషల్టాస్క్ఫోర్స్ పోలీసులు చేజ్‌చేసి పట్టుకున్నారు. అతని వద్ద సుమారు రూ.లక్షన్నర విలువైన డ్రగ్స్స్టిక్స్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన మేరకు.. కీసర మండలం రాంపల్లికి చెందిన రిత్విక్(40) ఉత్తరాఖండ్ కు వెళ్లి కొంత కాలం ఉండివచ్చాడు.
జల్సాలకు అలవాటు పడిన అతడు ఈజీ మనీ కోసం గంజాయితో తయారు చేసిన హాషిష్డ్రగ్స్స్టిక్స్ను అమ్మి డబ్బు సంపాదించాలని ప్లాన్చేశాడు. ఇందులో భాగంగా తన లగేజీతో పాటు ఉత్తరాఖండ్‌లో 80 గ్రాముల హాషిష్ డ్రగ్స్తీసుకుని రైలులో సికింద్రాబాద్‌కు వచ్చాడు. ముందస్తు సమాచారం మేరకు అతని కోసం ఎక్సైజ్ఎస్టీఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ రావు టీమ్, సికింద్రాబాద్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్ తన సిబ్బంది రైల్వే స్టేషన్లో నిఘా పెట్టారు. రిత్విక్ రైలు దిగిన వెంటనే పోలీసులను చూసి పారిపోతుండగా చేజ్‌చేసి అదుపులోకి తీసుకున్నారు.