న్యూఢిల్లీ: భారతదేశ టెక్స్‌టైల్ రంగానికి ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై అన్ని రకాల కస్టమ్స్ డ్యూటీలను (సుంకాలను) పూర్తిగా మినహాయిస్తున్నట్లు శనివారం ప్రకటించింది.
ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు అంటే ఐదు నెలల పాటు ఈ మినహాయింపు అమలులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. దిగుమతి సుంకం మినహాయింపు రేపటి నుంచి అమలులోకి రానుంది. దేశీయ మార్కెట్లో పత్తి సప్లయ్ గణనీయంగా పెరగనుంది.
