ఆగస్టు 3 నుంచి అమల్లోకి కొత్త విధానాన్ని అమలు చేయడమే కారణం
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ ) ట్రేడింగ్ టైమ్ 10 నిమిషాలు పెరగనుంది. ట్రేడింగ్‌ను సాయంత్రం 3:40 గంటల వరకు పొడిగిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ శుక్రవారం పేర్కొంది. మార్కెట్ ముగిసే సమయంలో ధరల గుర్తింపును (ప్రైస్ డిస్కవరీని) మరింత పారదర్శకంగా మార్చడానికి 'క్లోజింగ్ ఆక్షన్ సెషన్' (సీఏఎస్) విధానాన్ని ఎన్‌ఎస్‌ఈ తీసుకురాబోతోంది.
ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అనేది ట్రేడింగ్ ముగిసే సమయంలో ఉండే ఒక నిర్దిష్టమైన, స్వల్ప వ్యవధి సెషన్. ఇందులో ఇన్వెస్టర్లు సబ్మిట్ చేసే బై లేదా సెల్ ఆర్డర్ల ఆధారంగా సెక్యూరిటీకి చెందిన ఒక ముగింపు ధరను లెక్కిస్తారు. ఈ విధానంలో భాగంగానే ఎఫ్ అండ్ ఓ టైమింగ్ పెరగనుంది. ఈ ఏడాది ఆగస్టు 3 నుంచి ప్రీ ఓపెన్ సెషన్ ఉదయం 9 నుంచి 9.08 వరకు ఉంటుంది.
]సాధారణ మార్కెట్ సెషన్ 9:15 నుంచి – మధ్యాహ్నం 3:40 వరకు ఉంటుంది. ట్రేడ్ మాడిఫికేషన్ విండో 3:40 నుంచి – 4:15 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఈ టైమ్‌లో పెండింగ్‌లో ఉన్న ఆర్డర్లను సవరించొచ్చు. కాగా, క్యాష్ మార్కెట్ టైమింగ్స్‌ను ఎన్‌ఎస్‌ఈ మార్చలేదు. సాధారణ ట్రేడింగ్ ఉదయం 9.15 నుంచి సాయంత్రం 3.30 వరకు కొనసాగుతుంది.
