మళ్లీ మంత్రులతో ముఖాముఖి..రేపటి (జూన్ 17 ) నుంచి ప్రారంభం 

మళ్లీ మంత్రులతో ముఖాముఖి..రేపటి (జూన్ 17 ) నుంచి ప్రారంభం 

 హైదరాబాద్, వెలుగు: కొద్ది రోజుల క్రితం నిలిచిపోయిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మళ్లీ బుధవారం నుంచి మొదలుకానుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్ పాల్గొననున్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుండి వచ్చే విజ్ఞప్తులను ఆయన పరిశీలించి, పరిష్కరించడానికి కృషి చేస్తారని గాంధీ భవన్ సోమవారం ప్రకటించింది. ఈ అవకాశాన్ని ప్రజలు, కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.