V6 News

ఫిర్యాదు ఇచ్చినందుకు ఫెయిల్ చేసిన్రు

ఫిర్యాదు ఇచ్చినందుకు  ఫెయిల్ చేసిన్రు

ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ కాలేజీ అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై మెడికో ఆరోపణ
గతంలో ఆయనపై పోలీసులకు డాక్టర్ల కంప్లైంట్

హైదరాబాద్, వెలుగు: లేడీ డాక్టర్లపై ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ మెడికల్ కాలేజ్ అసోసియేట్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణరాజు వేధింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తనిఖీల పేరిట అర్ధరాత్రి లేడీ మెడికోల హాస్టల్ గదుల్లోకి పోవడం, డ్రెస్ చేంజింగ్ రూమ్స్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లడం, కిటికీల్లోంచి ఫొటోలు తీసి వేధింపులకు గురిచేయడంతో నారాయణరాజుపై గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా అందజేయడంతో ఆయనపై పోలీసులు ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నమోదు చేశారు. నారాయణరాజును అసోసియేట్ డైరెక్టర్ పోస్టు నుంచి తొలగించాలని మెడికోలు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ యాజమాన్యం అతన్ని వారం పాటు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం తరఫున కమిటీని కూడా నియమించారు. కానీ, ఆ తర్వాత తన పలుకుబడితో నారాయణరాజు అదే హోదాలో కొనసాగారు. నారాయణరాజుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పీజీ చేస్తున్న డాక్టర్ రష్మిత క్రియాశీలకంగా వ్యవహరించారు. రష్మిత ఫైనలియర్ పీజీ ఎగ్జామ్స్ గత నెలలో ముగియగా,4 రోజుల కింద ఫలితాలొచ్చాయి. థియరీ అన్ని సబ్జెక్టుల్లో ఆమె పాస్‌‌‌‌‌‌‌‌ అవగా, కాలేజీలో జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌లో ఫెయిల్ అయింది. పీజీ చేస్తున్నోళ్లు మొత్తం 79 మంది ఉండగా, తనను ఒక్కదాన్ని నారాయణరాజు కుట్రపూరితంగా ఫెయిల్ చేయించాడని రష్మిత ఆరోపిస్తున్నారు. తనపై పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని ఇప్పటికి అనేకసార్లు నారాయణరాజు తనను కోరారని, ఇందుకు తాను నిరాకరించడంతోనే తనపై కక్ష పెంచుకున్నాడని రష్మిత వెలుగుకు తెలిపారు. ఈ కుట్రలో భాగంగానే తనను ప్రాక్టికల్స్‌‌‌‌‌‌‌‌లో ఫెయిల్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు మరోసారి ఎగ్జామ్ పెట్టాలని కాళోజీ హెల్త్ వర్సిటీని డిమాండ్ చేస్తున్నారు. హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ రష్మితకు మద్దతు ప్రకటించింది. ఆమెకు మళ్లీ ఎగ్జామ్ పెట్టి, న్యాయం చేయాలని హెల్త్ వర్సిటీ వీసీకి అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మహేశ్​ లేఖ రాశారు. సోమవారం వీసీని నేరుగా కలిసి వినతిపత్రం అందజేస్తామని రష్మిత వెల్లడించారు.