నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో ..ఫేక్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

 నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో ..ఫేక్ సర్టిఫికెట్ల ముఠా అరెస్టు

గండిపేట, వెలుగు: నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌‌ పరిధిలో నకిలీ విద్యా సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న గ్యాంగ్‌‌ను నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్​కు చెందిన మీరా అక్తర్‌‌బైగ్, మహ్మద్‌‌ అజాబ్‌‌ అహ్మద్, వడ్డేపల్లి వెంకట్‌‌సాయి, విస్టాలా రోహిత్‌‌కుమార్, సత్తూరి శ్రవణ్‌‌ పలు యూనివర్సిటీల పేరుతో ఫేక్​ డిగ్రీ సర్టిఫికెట్లు తయారుచేసి విక్రయిస్తున్నారు. 

ఆదివారం నార్సింగి చింతచెట్టు ప్రాంతంలో సర్టిఫికెట్లను ఇచ్చేందుకు వచ్చారు. పక్కా  సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌‌ఆర్‌‌ఎం యూనివర్సిటీ, బెంగుళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌‌ఫర్‌‌, బోనాఫైడ్‌‌ సర్టిఫికెట్లు, నకిలీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు పంపినట్లు పోలీసులు తెలిపారు.