ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్.. రూ.42 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

ఫేక్ కరెన్సీ ముఠా అరెస్ట్.. రూ.42 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం..

మెహిదీపట్నం, వెలుగు: గుడిమల్కాపూర్​లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టైంది. ఇన్​స్పెక్టర్ బైరి రాజు వివరాల ప్రకారం.. రేతిబోలి సమీపంలోని ఓ అపార్ట్​మెంట్ వద్ద నకిలీ నోట్లు సరఫరా చేస్తున్నట్లు శనివారం సాయంత్రం సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.42 లక్షల విలువైన 500 రూపాయల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నకిలీ నోట్ల సరఫరా వెనుక పెద్ద ముఠా ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఇన్​స్పెక్టర్ తెలిపారు.