
బషీర్బాగ్,వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ఫ్, కడారి సత్యనారాయణ అలియాస్ కోసాది బూటక ఎన్ కౌంటర్ అని పౌర హక్కుల సంఘం ఆరోపించింది.
మృతుడు రామంచంద్రారెడ్డి భార్య మాలతితో కలిసి పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 22న చత్తీస్ చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్ మడ్ అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమన్నారు.
ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు నిరాయుధంగా రాయపుర్ నగరంలోనే దొరికారని, వారిని న్యాయస్థానంలో ప్రేవేశపెట్టాల్సింది పోయి చిత్రహింసలకు గురి చేసి చంపడం సరికాదన్నారు. ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపి వేసి, ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.