
హైదరాబాద్: సినిమాల్లో అవకాశం ఇస్తానంటూ తాను RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతినంటూ అమ్మాయిలకు వలవేస్తున్నాడు ఓ వ్యక్తి. డైరెక్టర్ అజయ్ భూపతి పేరుతో ఫేక్ ఫేస్ బుక్ పేజీని క్రియేట్ చేసి, అందమైన అమ్మాయిలతో చాట్ చేయడం మొదలుపెట్టాడు. ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయిల వివరాలు సేకరించి, వారితో వాట్సప్ చాటింగ్ చేసిన ఆగంతకుడు.. త్వరలో తాను హీరో విజయ్ దేవరకొండ, విశాల్ లతో సినిమా తీస్తున్నట్లు చెప్పేవాడు.
ఈ సినిమాలలో అవకాశం కల్పిస్తానని నమ్మించిన ప్రభుద్దుడు..వారి నుండి న్యూడ్ ఫొటోస్ సేకరించి వేధిస్తున్నాడు. ఈ విషయం సన్నిహితుల ద్వారా డైరెక్టర్ అజయ్ భూపతికి తెలిపింది. వెంటనే డైరెక్టర్ అజయ్.. తన పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.