
హైదరాబాద్ లో ఐఏఎస్ అధికారిని అని చెప్పుకుంటూ తిరుగుతోన్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఓయూ పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఆగస్టు 31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే? ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నలుగురు వ్యక్తులు బహిరంగ మూత్ర విసర్జన చేస్తుండగా కాలేజీ ముందు మూత్ర విసర్జన చేయకూడదని అక్కడ సెక్యూరిటీ చెప్పారు. దీంతో ఓ వ్యక్తి సెక్యూరిటీపై దాడికి పాల్పడ్డాడు. తాను ఐఏఎస్ ఆఫీసర్ అని నన్నే ప్రశ్నిస్తావా అంటూ అతనితో పాటు అతని వెంట ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు సెక్యూరిటీపై దాడి చేశారు. ఆగస్టు 31న ఈ ఘటన జరిగింది.
►ALSO READ | మున్సిపాలిటీల్లో స్టేట్ క్లైమేట్ సెంటర్.. వాతావరణ మార్పులపై అప్రమత్తం చేసేలా ఏర్పాటు
ఈ ఘటనపై సెక్యూరిటీ గార్డ్ ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (IES) కు చెందిన బోడ దేవీలాల్ ..IAS గా చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు గుర్తించారు. వారి దగ్గరి నుంచి ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను బోడా దేవిలాల్, జనార్ధన్, తులసీరామ్, ధన్ సింగ్ బోడాగా గుర్తించారు. వీళ్లు గతంలో కూడా OU ప్రాంగణంలో మద్యం సేవించడం, భద్రతా సిబ్బందితో గొడవలు పడినట్లు చెబుతున్నారు. అయితే గతంలో ఎలాంటి ఫిర్యాదు అందలేదని అన్నారు.