ఫేక్ పోలీస్.. బ్లాక్మెయిల్తో రూ. 10లక్షలు వసూలు

ఫేక్ పోలీస్.. బ్లాక్మెయిల్తో  రూ. 10లక్షలు వసూలు

లగ్జరీ లైఫ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్ కు అలవాటు పడడంతో వచ్చిన  జీతం సరిపోకపోవడంతో  ఓ వ్యక్తి సూడో పోలీస్ అవతరమెత్తి ఎత్తాడు.  నగరంలోని పార్సిగుట్టకు చెందిన సన్నీ జాదవ్ ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ గా పని చేస్తున్నాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన సన్నీ జాదవ్ కు వచ్చే జీతం సరిపోకపొవడంతో  దందాలు షురూ చేశాడు.   

పోలీసునని చెప్పుకుంటూ బ్లాక్ మెయిలింగ్ లకు దిగాడు.  స్టార్ హోటల్స్ లను అడ్డాలుగా చేసుకుని కాల్ గర్ల్స్ ను బుక్ చేసుకున్న కష్టమర్స్ టార్గెట్ గా చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.  2023 ఫిబ్రవరిలో సికింద్రాబాద్ మారియట్ హోటల్ వద్ద ఒక కస్టమర్ ను బ్లాక్ మెయిల్ చేశాడు సన్నీ.  తాను పోలీసునంటూ నకిలీ ఐడి కార్డు చూపించి న్యూడ్ వీడియోస్ పబ్లిక్ చేస్తాననని 5 లక్షలు, 2 తులాల బంగారు గొలుసు తీసుకున్నాడు.  

తర్వాత ఫోన్ ద్వారా బెదిరించి మళ్ళీ రూ. 5 లక్షలు వసూలు చేశాడు. అంతటితో అతని ఆగడాలు భరించలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అతని నుండి  రూ. 3 లక్షల నగదు, టూ వీలర్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  2017లో మాదాపూర్ పీఎస్ లో కూడా సన్నీ జాదవ్ పై కేసు నమోదు అయినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.