Hey Balwanth Review: టైటిల్ మారినా టార్గెట్ మిస్ కాలేదా?.. సుహాస్ ‘హే బలవంత్’ అసలు రివ్యూ ఇదే!

Hey Balwanth Review: టైటిల్ మారినా టార్గెట్ మిస్ కాలేదా?.. సుహాస్ ‘హే బలవంత్’ అసలు రివ్యూ ఇదే!

‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హే బలవంత్ (Hey Balwanth)’. శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026న) చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే ఆసక్తిని రేకెత్తించింది.

ముఖ్యంగా విడుదలకు ఐదు రోజుల ముందు ‘హే భగవాన్!’ అనే టైటిల్‌ను ‘హే బలవంత్’గా మార్చాలని సెన్సార్ సూచించడంతో ఈ సినిమా మరింత హాట్ టాపిక్‌గా మారింది. అదనంగా, ‘రైటర్ పద్మభూషణ్’కు కథ అందించిన షణ్ముఖ ప్రశాంత్ ఈ చిత్రానికి కూడా కథ అందించడంతో అంచనాలు మరింత పెరిగాయి.

టైటిల్ మారినా, కథలోని బలం ఈ సినిమాను గెలిపించిందా? లేదా? మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో వచ్చిన సుహాస్ ఎలాంటి హిట్ అందుకున్నాడు? అనే విషయాలను పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

కథేంటంటే:

ఇదొక వినూత్నమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో సుహాస్ తండ్రిగా రావు బలవంత్ పాత్రలో (సీనియర్ నటుడు నరేష్) నటించారు.. ఆయన దశాబ్దాలుగా తన కుటుంబ వ్యాపారాన్ని (Family Business) చాలా రహస్యంగా నడుపుతుంటారు.

అది ఎంత రహస్యం అంటే.. సొంత కుటుంబ సభ్యులకు కూడా దాని గురించి తెలియదు. తండ్రి తర్వాత ఆ వ్యాపార బాధ్యతలను కృష్ణ బలవంత్ (సుహాస్) చేపట్టాలని నిర్ణయించుకుంటాడు.

అయితే, ఆ వ్యాపారం వెనుక ఉన్న అసలు రహస్యం తెలిసినప్పుడు సుహాస్‌ షాక్ అవుతాడు. కృష్ణ తండ్రి చేసే బిజినెస్‌ను చూసి, ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగారం) కూడా అసహ్యించుకొని వెళ్లాల్సి వస్తుంది. 

ఇంతకీ రావు బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏమిటి? మిత్ర తాత (బాబు మోహన్)కి ఈ బిజినెస్‌తో ఉన్న సంబంధం ఏమిటి? అసలు చంప (స్రవంతి) ఎవరు? ఈ బిజినెస్ వల్ల కృష్ణకు ఎదురైన సమస్యలు ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘హే బలవంత్’ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

‘హే బలవంత్’ ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగే వినోదాత్మక సంఘటనల చుట్టూ తిరిగే కథ. పరిస్థితుల వల్ల హీరో ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని తన తెలివితేటలతో ఎలా అధిగమిస్తాడన్నదే ప్రధాన అంశం.

నిజానికి ఈ కథని చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ మీద రాసుకున్నారు షణ్ముఖ ప్రశాంత్. అయితే కథ ఎంత సెన్సిబుల్ అయినా కూడా అందులోనుంచి అంతే స్థాయిలో కామెడీని కూడా జనరేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ గోపీ అచ్చర. 

సమాజం చిన్నచూపు చూసే ఒక వృత్తిలో మహిళలు ఎదుర్కొనే అవమానాలు, బాధలను ప్రతిబింబిస్తూ.. చట్టవిరుద్ధమైన వ్యాపారం వెనుక ఉన్న మానవీయ కోణాన్ని దర్శకుడు స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో తండ్రి–కొడుకుల అనుబంధం, విద్య ప్రాధాన్యత వంటి విలువైన అంశాలను కూడా హైలైట్ చేశారు.

ఈ విషయాలన్నింటినీ సీరియస్‌గా కాకుండా, లైట్ హార్టెడ్ కామెడీ శైలిలో చెప్పడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులకు పెద్ద సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. కేవలం నవ్వించడమే కాకుండా, చివర్లో వచ్చే తండ్రీ-కొడుకుల సెంటిమెంట్ అందరినీ మెప్పిస్తుంది. 

నటీనటుల నటన:

‘అంబాజీపేట’తో సుహాస్, శివానీ నాగారం జంట హిట్ పెయిర్‌‌‌‌‌‌‌‌గా నిలిచింది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులని అలరించారు. సుహాస్ తన సహజమైన నటనతో మెప్పించారు. అమాయకత్వంతో పాటు కామెడీ పండించే పాత్రలో శివానీ ఆకట్టుకుంది.

సీనియర్ నరేశ్.. రావు బల్‌వంత్‌ పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్లో కూడా తన టైమింతో అదరగొట్టేశారు. ‘పోకిరీ’ సీన్‌తో పాటు బాలకృష్ణ, ఎన్టీఆర్‌లను ఇమిటేట్‌ చేస్తూ చెప్పే డైలాగుకు పడి పడి నవ్వుతారు. వెన్నెల కిషోర్, సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కామెడీ ట్రాక్ బాగుంది. యాంకర్‌ స్రవంతి కీలకమైన చంప పాత్రలో నటించి మెప్పించింది.  

టెక్నీకల్ విభాగం:

డైరెక్టర్ గోపి అచ్చర తన టేకింగ్తో మ్యాజిక్ చేశారు. షణ్ముఖ ప్రశాంత్ రాసుకున్న స్టోరీ లైన్ బాగుంది. వివేక్‌ సాగర్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. పాటలు విజువల్గా ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ మహీ రెడ్డీ బ్యూటిఫుల్ విజువల్స్ అందించారు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.