నకిలీ పోలీసు అరెస్ట్

నకిలీ పోలీసు అరెస్ట్

శంషాబాద్, వెలుగు: అమాయకులను, బైక్ మెకానిక్ లను టార్గెట్ గా చేసుకుని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే నకిలీ పోలీసు పట్టుబడ్డాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సీఐ బాలరాజు తెలిపిన ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల  మండలం నాగసాల గ్రామానికి చెందిన బోయ రాజ్ కుమార్(26) డ్రైవర్. ఈజీగా మనీ సంపాదించేందుకు నకిలీ పోలీసు అవతారమెత్తాడు. అమాయకులు, బైక్ మెకానిక్ ల వద్దకు వెళ్లి పోలీసునని డబ్బులు వసూలు చేయసాగాడు. 

రాళ్లగూడలోని ఏఎస్ బైక్ మెకానిక్ షాప్ కు వెళ్లాడు. నెల రోజుల కిందట మీ వద్ద  బైక్  రిపేర్ చేయించానని, కొన్ని రోజులకే రిపేర్ అయిందని, మళ్లీ  షోరూమ్ లో రిపేర్ చేయించగా.. రూ. 5 వేల నుంచి రూ.10 వేలు అయిందని వెంటనే డబ్బులు ఇవ్వాలని లేదంటే కేసు పెట్టి అరెస్టు చేస్తామని తను పోలీసునని బెదిరించాడు. భయాందోళ చెందిన  మెకానిక్ ల వద్ద బలవంతంగా ఫోన్ పే లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయించుకుని రాజ్ కుమార్ పరార్ అయ్యాడు. మోసపోయానని గ్రహించిన బైక్ మెకానిక్ లు మంగళవారం పోలీసులను సంప్రదించాడు. రాజ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మెకానిక్ లను, ప్రజలను నమ్మించేందుకు తన వాట్సప్ డీపీలో రాజ్ కుమార్ పోలీస్ అని పెట్టుకున్నాడని, తెలంగాణ, ఏపీలో అతనిపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్టు సీఐ బాలరాజు తెలిపారు.