ఫేక్ వీసాలు : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 మంది మహిళలు అరెస్ట్

ఫేక్ వీసాలు : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 9 మంది మహిళలు అరెస్ట్

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫేక్ వీసాలు కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి కువైట్ కు వెళ్తున్న 9మంది వీసాలు ఫేక్ అని తెలాయి.  వీరిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. వీరంతా కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రలకు చెందిన వారుగా గుర్తించారు. డబ్బు సంపాధించేందుకు ఎక్కువగా కువైట్ వెళ్తుంటారు. ఏజెంట్ల మోసాలతో అమాయకులు మోసపోతున్నారని చెప్పారు పోలీసులు. 9 మంది మహిళల వెనక ఎవరైనా మగవారు ఉన్నారా..ఏజెంట్ ఏవరా అనే కోనంలో దర్యాప్తు చేపట్టామని, పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుపుతామన్నారు పోలీసులు.