పాతబస్తీలో ఫలక్నుమా ఏసీపీ ఆకస్మిక దాడులు

పాతబస్తీలో ఫలక్నుమా ఏసీపీ ఆకస్మిక దాడులు

హైదరాబాద్ : పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫలక్ నుమా ఏసీపీ షేక్ జహంగీర్ అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉప్పుగూడ లలితాబాగ్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంటి నుంచి భారీగా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళపై గతంలోనే పీడీ యాక్ట్ నమోదుచేసినా ఆమె మాత్రం తీరు మార్చుకోలేదు. ఇంట్లోనే అక్రమంగా మద్యం విక్రయిస్తుండటంతో ఇంటిపై దాడి చేసి కేసు నమోదుచేశారు. తదుపరి విచారణ కోసం మహిళను ఛత్రినాక పోలీసులకు అప్పగించారు.