
మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఫామిలీ ధమాకా(Family dhamaka).. ఇది దాస్ కా ఇలాకా అనే పేరుతో వస్తున్న ఈ గేమ్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షోకి సంబంధించి ఇప్పటికే రిలీజైన ప్రోమోలి ఆడియన్స్ లో ఆసక్తిని పెంచగా.. తాజాగా ఎపిసోడ్ గా సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
అయితే హోస్ట్ గా విశ్వక్ ఎలా చేస్తాడు అనే వారికి తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు ఈ మాస్ కా దాస్. తన సస్టైల్ ఆఫ్ హోస్టింగ్ తో అదరగొట్టేశాడు ఈ కుర్ర హీరో. ఏమాత్రం బెరుకు లేకుండా.. పర్ఫెక్ట్ టైమింగ్ తో, అదిరిపోయే పంచులతో ఆడియన్స్ ను విపరీతంగా అలరించాడు. పక్కా ఫామిలీ షో గా వస్తున్న ఈ ప్రోగ్రామ్ లో మధ్యలో స్టార్ కూడా వచ్చి ఎంటర్టైన్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో విరాళ అవుతోంది. ఇక ఈ షో సెప్టెంబర్ 8 నుండి ప్రతీ శుక్రవారం ఆహాలో స్స్ట్రీమింగ్ కానుంది.