కరోనా ట్రీట్ మెంట్.. రోజుకు రూ.5 వేలే!

కరోనా ట్రీట్ మెంట్.. రోజుకు రూ.5 వేలే!

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: కరోనా మహమ్మారి బారిన పడినవారికి ఎక్కడైనా ఒకటే ట్రీట్ మెంట్. కానీ.. ఖర్చు మాత్రం ఒక్కో హాస్పిటల్ లో ఒక్కోలా.. రూ. వేల నుంచి లక్షల్లో తేడా ఉంటోంది. కాస్త పేరున్న దవాఖాన్ల నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకూ రోజుకు రూ. 30 వేల నుంచి లక్ష వరకూ బిల్లులు కట్టాల్సి వస్తోంది. కరోనా కష్టకాలంలో తక్కువ ఖర్చుతోనే ట్రీట్ మెంట్ చేస్తూ చిన్న క్లినిక్ లు నడుపుతున్న డాక్టర్లు, తెలిసిన, ఫ్యామిలీ డాక్టర్లు పేద, మిడిల్ క్లాస్ పేషెంట్లకు అండగా నిలుస్తున్నారు. ఖర్చు మ్యాగ్జిమం రోజుకు రూ. 5 వేలకు మించకుండా చూస్తూ పర్సనల్ కేర్ తో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

రూంలు రెంటుకు తీసుకుని..

కరోనా పేషెంట్లకు ఫ్యామిలీ డాక్టర్లు ముందుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మైల్డ్ సిమ్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్న వారికి టెస్టులు చేయించి, మందులు ఇస్తున్నారు. హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమైన వారికి మాత్రమే ఐసోలేషన్ లో ట్రీట్ మెంట్ చేస్తున్నారు. దవాఖాన్లు, క్లినిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలోని హోటల్స్, లాడ్జీల్లో షెల్టర్ తీసుకుంటున్నారు. కొన్ని టెస్టుల కోసం టెక్నీషియన్ లను పిలిపించి, శాంపిల్స్ ను బయటికి పంపుతున్నారు. వైరల్​ లోడ్​ను తెలుసుకునేందుకు హెచ్ఆర్ సీటీ టెస్ట్ చేయిస్తున్నారు.

రోజూ రూ.5 వేలకు మించకుండా.. 

లంగ్స్ పై వైరస్ ప్రభావం చూపిన వారికి మాత్రమే ఐసోలేషన్ ను అడ్వైజ్ చేస్తున్నారు. పేషెంట్ల అంగీకారంతో లాడ్జీలు, రెంటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూంలను ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఏర్పాటు చేస్తున్నారు. రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నర్సింగ్ చార్జీలతో కలిపి రోజూ ఖర్చు రూ.5 వేలకు మించకుండా ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. డాక్టర్ల మెనూ ప్రకారం బంధువుల ఇండ్లు, హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బాధితులు ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెప్పించుకుంటున్నారు. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ సంస్థలకు ఆర్డర్స్ చేస్తున్నారు. రూమ్ రెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోజూ రూ.1,000 నుంచి రూ.1,500 చెల్లిస్తున్నారు.  

స్టేజెస్ ప్రకారం ట్రీట్ మెంట్.. 

మైల్డ్ సింప్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర్నుంచి సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింప్టమ్స్ వరకు ఐదు స్టేజెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను డాక్టర్లు గుర్తిస్తున్నారు. శ్వాస ఇబ్బందితో బాధపడుతున్న వారికి యాంటీబయాటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యాంటీ కోయాగ్యులేట్, స్టెరాయిడ్స్​తో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఆక్సిజన్​ను ముందుగానే సిద్ధంగా ఉంచుకుంటున్నారు. స్పెషల్ నర్సులతో మానిటరింగ్ చేస్తున్నారు. 
15 రోజులకు 2 లక్షలయింది మాది యాదాద్రి జిల్లా. నా భర్త (34) ఉగాది రోజు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఎల్బీ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలిసిన డాక్టర్​కు చూపించాం.  కరోనా సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఉన్నట్లు గుర్తించారు. దీంతో అక్కడే 15 రోజుల పాటు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకున్నాం. మెడిసిన్స్, రూమ్ రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెస్టులు, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజులు మొత్తం కలిపి రూ.2 లక్షలు ఖర్చు అయ్యింది. ప్రైవేట్ ఆస్పత్రులైతే రూ.15 లక్షలకు తక్కువ కాదని తెలిసింది.  
- జ్యోతి, బాధితుడి భార్య