హైదరాబాద్లో మ్యాచ్.. బీసీసీఐ కీలక ప్రకటన

హైదరాబాద్లో మ్యాచ్.. బీసీసీఐ కీలక ప్రకటన

వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల సెప్టెంబర్ 29న ఉప్పల్ స్డేడియంలో  వార్మప్  మ్యాచ్ జరగనుంది.  అయితే ఆ సమయంలో గణేష్ ఉత్సవాలు,  మిలాద్ ఉన్ నబీ  ఉత్సవాల కారణంగా ఈ మ్యాచ్ కు  ప్రేక్షకులను అనుమతించబడం లేదు.  దీంతో ఈ మ్యాచ్ కు టికెట్లు బుక్ చేసుకున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో దీనిపై స్పందించిన  బీసీసీఐ టికెట్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి డబ్బు చెల్లిస్తామని ప్రకటించింది.  

 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్  జరగనుంది.  ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్‌ లకు మూడు ప్రాంతాలు వేదిక కానున్నాయి. అందులో తిరువనంతపురం, గౌహతితో పాటు హైదరాబాద్ కూడా ఉంది.  ఇదిలావుండగా వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు భారత్‌కు బయలుదేరడానికి 48 గంటల లోపే వీసాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ధృవీకరించింది. 

పాకిస్తాన్ జట్టు సెప్టెంబర్ 27 తెల్లవారుజామున లాహోర్ నుండి దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటారు.   న్యూజిలాండ్‌తో సెప్టెంబర్ 29న తలపడిన పాకిస్తాన్..   అక్టోబర్ 3న అదే వేదికపై తమ రెండో వార్మప్ మ్యాచ్  లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.