NED vs ENG: ఎందుకన్నా అంత రిస్క్.. తగలరాని చోట తగిలితే జీవితం అంతా ఏం చేస్తావ్!

NED vs ENG: ఎందుకన్నా అంత రిస్క్.. తగలరాని చోట తగిలితే జీవితం అంతా ఏం చేస్తావ్!

వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ పై ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటికే వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడం కోసం ఈ మ్యాచ్ కీలకంగా మారింది. దీంతో ఈ మ్యాచ్ సీరియస్ గా తీసుకున్న బట్లర్ సేన స్థాయికి తగ్గట్టుగానే ఆరంభంలో బాగా రాణించింది. తొలి 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 133 పరుగులు చేసి భారీ స్కోర్ మీద కన్నేసింది.

ఈ సమయంలోనే ఇంగ్లాండ్ రూట్  వికెట్ ను కోల్పోయింది. అయితే రూట్ వికెట్ సోషల్ మీడియాలో నవ్వు తెప్పిస్తుంది. వాన్ బీక్ వేసిన 21 ఓవర్ రెండో బంతికి రివర్స్ స్కూప్ కు ప్రయత్నించిన ఈ స్టార్ బ్యాటర్ బౌల్డయ్యాడు. బంతిని సరిగా అంచనా వేయలేని రూట్ ఈ స్కూప్ చేసే క్రమంలో రెండు కాళ్ళ మధ్యలో నుంచి బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది. కొంచెం ఉంటే రూట్ కు ఈ బంతి తగలరాణి చోట తగిలేది. కానీ అదృష్టవశాత్తు బతికిపోయాడు.

రూట్ అవుట్ చూసిన ఇంగ్లాండ్ అభిమానులు నవ్వుకోవడం హైలెట్ గా మారింది. సాధారణంగా రివర్స్ స్కూప్ షాట్స్ ఆడటంలో రూట్ సిద్ధహస్తుడు. అయితే ఈ సారి నెదర్లాండ్స్ పేసర్ కు మాత్రం దొరికిపోయాడు. ఈ మ్యాచ్ లో రూట్ 34 బంతుల్లో 28 పరుగులు చేసి ఔటయ్యాడు         

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)