పరిగి, వెలుగు: పరిగి మండలం దిర్సంపల్లిలో శనివారం ఉదయం ఓ రైతు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తాను కొన్నేండ్లుగా సాగు చేసుకుంటున్న చెరువు శిఖం భూమిలో కొందరు అధికారులు, లీడర్లు ఉద్దేశపూర్వకంగా ఉపాధి హామీ పనులు పెట్టించారని సదరు రైతు ఆరోపించాడు. చెరువు నుంచి ఇటుక బట్టీలకు అక్రమంగా ఒండ్రుమట్టిని తరలిస్తున్నారంటూ తాను అధికారులకు ఫిర్యాదు చేసినందుకే.. తనపై కక్షగట్టి ఇలా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డాడు.
ఈ వేధింపులు తట్టుకోలేక బలవంత్రెడ్డి అనే ఆ రైతు.. సెల్ టవర్ ఎక్కి సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
