
యాదాద్రి భువనగిరి జిల్లాలో.. ఇద్దరు అవినీతి అధికారులు దొరికిపోయారు. గుండాల మండలం అంబాల గ్రామానికి చెందిన VRO శ్రీను, VRA యాదగిరి…. నరాముల చిన్న ఎల్లయ్య అనే రైతు దగ్గర 42 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. 4 ఎకరాల పొలానికి సంబంధించిన వివరాలు.. ఆన్ లైన్ లోకి ఎక్కించేందుకు ఎకరానికి 20 వేల చొప్పున.. 80 వేలు డిమాండ్ చేశారు. చివరగా.. రైతు 42 వేలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. తర్వాత..ACB అధికారులకు ఫిర్యాదు చేశాడు.
శుక్రవారం.. గుండాల తహశీల్దార్ ఆఫీసులో డబ్బు తీసుకుంటుండంగా.. పట్టుకున్నారు. వీఆర్వో శ్రీనివాస్ 2 రోజుల క్రితమే బదిలీపై వెళ్లిపోయాడు. అయినా.. ఈ రోజు లంచం తీసుకోవడానికి వచ్చి.. ACB అధికారులకు దొరికాడు.