ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన రైతు సంఘాలు

ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించిన రైతు సంఘాలు

MSP, ఉద్యమ కేసుల ఎత్తివేత సహా ఇతర డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చల కోసం ఐదుగురు సభ్యుల కమిటీని ప్రకటించాయి రైతు సంఘాలు. రైతు నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, శివకుమార్ కక్కా, గుర్నామ్ సింగ్ చదూనీ, యుధ్ వీర్ సింగ్, అశోక్ ధవాలేలు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఢిల్లీలోని సింఘు బోర్డర్ దగ్గర రైతు సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలకు పిలిచారని రైతు నేతలు చెప్పారు. ఉద్యమంలో చనిపోయిన 702 మంది రైతుల పేర్లను కేంద్రానికి పంపుతామన్నారు. కేసులు విత్ డ్రా చేసేదాకా ఉద్యమంలో వెనక్కి తగ్గకూడదని సమావేశంలో తీర్మానించారు.