పత్తి గింజలను కాపాడుకునేందుకు తండ్లాట

పత్తి గింజలను కాపాడుకునేందుకు తండ్లాట

తొలకరి జల్లులు పడగానే రైతులు దుక్కులు దున్ని పత్తి విత్తనాలు విత్తుకున్నారు. తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో తిప్పలు పడుతున్నారు. విత్తుకున్న పత్తి గింజలను కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నారు. కరీంనగర్‌‌‌‌  జిల్లా ఇల్లందకుంటకు చెందిన నర్సయ్య మూడెకరాల్లో నాటిన విత్తనాలు ఎండిపోకుండా స్ప్రేయర్​తో నీటి తడి ఇస్తున్నాడు. 

అలాగే, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో మంద తిరుపతి తన ఆరెకరాల్లో పత్తి గింజలను కాపాడుకునేందుకు స్పింక్లర్లను ఏర్పాటు చేసుకున్నాడు. వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు.