గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా

గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా
  • ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారిపై  బైఠాయించి రైతులు ధర్నా చేశారు. దీంతో కొంత సమయం పాటు అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ...మార్కెట్ యార్డ్ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై తమని మోసం చేస్తున్నారన్నారని వాపోయారు. ప్రభుత్వం వేరుశనగ  పంట క్వింటాల్ కు రూ. 8వేల ఒక వంద ధర నిర్ణయించగా.. మార్కెట్ అధికారులు, దళారులు కుమ్మక్కై రూ. 4 వేల 700లే ఇస్తున్నారన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ తమది రైతు ప్రభుత్వం అంటూనే.. రైతులను నట్టేటా ముంచుతున్నారని వారు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ అధికారులు వేరుశనగ పంటను కొనకపోతే మార్కెట్ మూసివేస్తామని వారు హెచ్చరించారు. తమకు అన్యాయం చేస్తున్న అధికారులు, దళారులపై చర్యలు తీసుకొని, గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండి..

గురుకులాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయి

కేసీఆర్ అలా అనలేదు: మోత్కుపల్లి