కేసీఆర్ అలా అనలేదు: మోత్కుపల్లి

కేసీఆర్ అలా అనలేదు: మోత్కుపల్లి

సీఎం కేసీఆర్ పై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు టీఆర్ ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు. అంబేద్కర్ గురించి సీఎం కేసీఆర్ ఎక్కడా మాట్లాడలేదని..రాజ్యాంగంపై చర్చ జరగాలని మాత్రమే అన్నారని తెలిపారు. కానీ బీజేపీ నేతలు కేసీఆర్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రైతు చట్టాలపై మోడీ క్షమాపణ చెప్పినప్పడే ఆయన ప్రధానిగా ఉండే అర్హతను కోల్పోయారన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా కేంద్రం కాలపాయన చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ లెవల్ లో సీఎం కేసీఆర్ ఎదుగుతుంటే దాన్ని చూసి తట్టుకోలేక బీజేపీ నేతలు కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బడ్జెట్ లో  తెలంగాణకు అన్యాయం చేశారని..బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధుల కేటాయింపులు చేశారని ధ్వజమొత్తారు. అందుకే కేంద్రంపై పోరాటానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని..ఇందులో తప్పేముందన్నారు. పేదింటి ఆడ పిల్లల కోసం కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని.. కానీ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేయడం దారుణమన్నారు. దళితులపై ప్రేమ ఉంటే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. రాష్ట్ర బడ్జెట్ లో దళిత బంధు పథకానికి 20 వేల కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించబోతున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇస్తున్న అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం 

అసదుద్దీన్పై దాడిని ఖండించిన వైఎస్ షర్మిల

పాతబస్తీలో ఎంఐఎం బంద్