చలో ఢిల్లీ.. రణరంగంగా బార్డర్లు​

చలో ఢిల్లీ..  రణరంగంగా బార్డర్లు​

 

  • బారికేడ్లు, కంచెలతో రోడ్లు బ్లాక్​ ట్రాక్టర్లతో తొలగించిన రైతులు
  • టియర్ గ్యాస్, వాటర్​ కేనన్లు ప్రయోగించిన పోలీసులు
  • శంభు, సింఘు బార్డర్లలో టెన్షన్​ఏదో ఒకటి తేల్చుకునేదాకా 
  • తిరిగి వెళ్లబోమన్న రైతులు
  • ఆరు నెలలకు సరిపడా సరుకులతో వచ్చినట్లు వెల్లడి

ఢిల్లీ బార్డర్లు​ రణరంగంగా మారాయి. కనీస మద్దతు ధరతోపాటు ఇతర డిమాండ్లు నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి సుమారు లక్ష మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. సిటీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఆగ్రహించిన రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో టెన్షన్​ వాతావరణం నెలకొంది. రైతులు తమ వెంట ఆరు నెలలకు సరిపడా రేషన్, పెట్రోల్, డీజిల్ వంటి సామగ్రి మొత్తం ట్రక్కులు, ట్రాక్టర్లలో తెచ్చుకున్నారు. ఇనుప కంచెలను కోసే కట్టర్​లు, అవి పని చేసేందుకు జనరేటర్లు కూడా వెంట తెచ్చుకున్నారు.

చండీగఢ్/న్యూఢిల్లీ: ఢిల్లీ సరిహద్దు రణరంగంగా మారింది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ నుంచి సుమారు లక్ష మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ సరిహద్దు వద్ద ఉన్న టిక్రి, సింఘు, ఘాజీపూర్, శంభు వద్దకు చేరుకున్నారు. పార్లమెంట్ ఎదుట నిరసన తెలిపేందుకు సిద్ధం అయ్యారు. ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రైతులను అదుపు చేసేందుకు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్​లు ప్రయోగించారు. దీంతో ఆగ్రహించిన రైతులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. కురుక్షేత్రలో రోడ్లపై అడ్డుగా ఉన్న బారికేడ్లను ట్రాక్టర్లతో లాగే పారేశారు. ముళ్ల కంచెలను బ్రిడ్జిపై నుంచి ఘగ్గర్ నదిలో పడేశారు. శంభు బార్డర్ ఫ్లై ఓవర్​పై సేఫ్టీ గార్డ్స్​ను ధ్వంసం చేశారు.

ట్రాలీల్లో రేషన్, ఫ్యూయెల్ నిల్వలు

తమ డిమాండ్లు నెరవేర్చే దాకా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదంటూ తేల్చిచెప్పారు. ఆరు నెలలకు సరిపడా రేషన్, పెట్రోల్, డీజిల్ వంటి సామాగ్రి మొత్తం ట్రక్కులు, ట్రాక్టర్​ ట్రాలీలలో తీసుకొచ్చారు. ఇనుప కంచెలు కోసే కట్టర్​లు, అవి పనిచేసేందుకు అవసరమైన జనరేటర్లు వెంట తెచ్చుకున్నారు.

డ్రోన్ల సాయంతో టియర్​ గ్యాస్​ ప్రయోగం

సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చాతో పాటు మొత్తం 200కు పైగా రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్​కు పిలుపునిచ్చాయి. దీంతో ఢిల్లీ బార్డర్​కు చేరుకున్న వేలాది మంది రైతులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. టియర్ గ్యాస్​ ప్రయోగించడంతో రైతులు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పరుగులు పెట్టారు. ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. హర్యానాలో అంబాలా, జింద్, ఫతేహాబాద్, కురుక్షేత్ర, సిర్సా వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. డాటా సింగ్​వాలా – ఖనౌరీ బార్డర్ వద్ద బారికేడ్లు దాటేందుకు రైతులు ప్రయత్నించారు. 

పక్కనున్న గ్రామాల గుండా ఢిల్లీలోకి..

టిక్రి, సింఘు, ఘాజీపూర్ ఏరియాల్లో 5 వేల మంది పోలీసులను మోహరించారు. హైవేలు క్లోజ్ చేయడంతో పక్కనే ఉన్న గ్రామాల నుంచి వెహికల్స్ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నాయి. భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. కాగా, ట్రాక్టర్లు, ట్రక్కుల్లో కాకుండా నడుచుకుంటూ.. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో వెళ్తే ఎవరినీ అడ్డుకోమని అంబాల రేంజ్ ఐజీ సిబాశ్ కబిరాజ్ అన్నారు. మరోవైపు, పంజాబ్, హర్యానా బార్డర్​లో అంతర్జాతీయ సరిహద్దుల మాదిరి బారికేడ్లు ఏర్పాటు చేశారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నేత సర్వన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు అనిపించడం లేదన్నారు. సోమవారం సాయంత్రం కేంద్ర మంత్రులతో నిర్వహించిన రెండో రౌండ్ చర్చలతో ఇది స్పష్టమైందని తెలిపారు.

ఇవీ డిమాండ్లు

 

  • పంటకు కనీస మద్దతు ధర
  • (ఎంఎస్‌‌పీ)కు భరోసా కల్పించేలా చట్టం చేయాలి.
  • స్వామినాథన్‌‌ కమిషన్‌‌ సిఫార్సులు అమలు చేయాలి.
  • పంటరుణాలు మాఫీ చేయాలి.
  • రైతులు, కూలీలకు పింఛన్లు ఇవ్వాలి. 
  • అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై కేసులు ఎత్తేయాలి. 
  • ఆ టైమ్​లో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి.
  • ఎలక్ట్రిసిటీ యాక్ట్ - 2020ను వెంటనే రద్దు చేయాలి.
  • లఖింపూర్ ఖేరిలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం.