చరిత్ర సృష్టించిన శార్దుల్.. IPL హిస్టరీలో 3 సార్లు ట్రేడ్ అయిన తొలి క్రికెటర్‌గా రికార్డ్

చరిత్ర సృష్టించిన శార్దుల్.. IPL హిస్టరీలో 3 సార్లు ట్రేడ్ అయిన తొలి క్రికెటర్‌గా రికార్డ్

ముంబై: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‎ను ట్రేడ్ డీల్‎లో భాగంగా ముంబై ఇండియన్స్  కొనుగోలు చేసింది. వేలానికి ముందే లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.2 కోట్లకు దక్కించుకుంది. శార్దుల్ ట్రేడ్ డీల్‎ను ఐపీఎల్ అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. తద్వారా శార్దుల్ ఠాకూర్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే మూడు సార్లు ట్రేడ్ అయిన తొలి క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు. 

2017లో పంజాబ్ కింగ్స్ నుంచి రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ ట్రేడింగ్ విండోలో శార్దుల్‎ను  కొనుగోలు చేసింది. 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌ అతడిని ట్రేడ్ చేసుకుంది. 2025లో లక్నో నుంచి ముంబై ఇండియన్స్ ఈ ఆల్ రౌండర్‎ను ట్రేడ్ డీల్‎లో భాగంగా దక్కించుకుంది. ఈ మూడు ట్రేడ్ డీల్స్ ప్లేయర్ టూ ప్లేయర్ ట్రేడ్ కాకుండా క్యాష్ ట్రేడే కావడం గమనార్హం.

కాగా, గతేడాది జరిగిన మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‎ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. దీంతో అన్ సోల్డ్ ప్లేయర్‎గా మిగిలిపోయాడు. అయితే.. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో రూ.2 కోట్లకు శార్దూల్‌ను లక్నో జట్టులోకి తీసుకుంది. లక్నో తరుఫున10 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 13 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‎లో కూడా రాణించాడు. కానీ.. వచ్చే సీజన్ కోసం లక్నో ఒక ప్రీమియర్ ఓవర్సీస్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతోంది. ఇందులో భాగంగానే శార్ధుల్‎ను ముంబైకు అమ్మేసింది.

శార్దుల్ ఐపీఎల్ కెరీర్:

శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్‎లో ఇప్పటి వరకు ఏడు ఫ్రాంచైజీల తరుఫున ప్రాతినిధ్యం వహించాడు. పంజాబ్ కింగ్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. ఐపీఎల్‌లో మొత్తం 105 మ్యాచ్‌లు ఆడి 30.31 సగటు, 9.4 ఎకానమీతో 107 వికెట్లు పడగొట్టాడు. 42 ఇన్నింగ్స్‌లలో 139.48 స్ట్రైక్ రేట్‌తో 325 రన్స్ చేశాడు.

►ALSO READ | ట్రేడ్ డీల్‎లో పవర్ హిట్టర్‎ను పట్టేసిన ముంబై.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందంటే..?