ట్రేడ్ డీల్‎లో పవర్ హిట్టర్‎ను పట్టేసిన ముంబై.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందంటే..?

ట్రేడ్ డీల్‎లో పవర్ హిట్టర్‎ను పట్టేసిన ముంబై.. ఎన్ని కోట్లకు కొనుగోలు చేసిందంటే..?

న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలానికి ముందే ముంబై ఇండియన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ట్రేడింగ్ విండో ఆప్షన్‎ను ఉపయోగించుకుని తక్కువ ధరకే టాలెంటెడ్ ప్లేయర్లను కొనుగోలు చేస్తోంది. ట్రేడ్ డీల్‎లో భాగంగా లక్నో నుంచి భారత స్టార్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‎ను దక్కించుకున్న ముంబై తాజాగా మరో విధ్వంసకర ఆల్ రౌండర్‎ను పట్టేసింది.

ట్రేడింగ్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి వెస్టిండీస్ వీరుడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‎ను ముంబై సొంతం చేసుకుంది. క్యాష్ ట్రేడ్‌‌‌ ఒప్పందం కింద గుజరాత్‎కు రూ.2.6 కోట్లు చెల్లించింది ముంబై. ఈ విషయాన్ని ఐపీఎల్ గురువారం (నవంబర్ 13) ధృవీకరించింది.

గత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఫినిషర్ పాత్ర పోషించిన రూథర్ ఫోర్డ్ 11 ఇన్నింగ్స్‌లలో 157.29 స్ట్రైక్ రేట్, 32.33 సగటుతో 291 పరుగులు చేశాడు. ఓవరాల్‎గా ఐపీఎల్‎లో 23 మ్యాచ్‌లు ఆడిన రూథర్ ఫోర్డ్ 137.37 స్ట్రైక్ రేట్‌తో 397 పరుగులు చేశాడు. ఇందులో 26 సిక్సర్లు, 25 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్‎లో ముంబై, గుజరాత్, బెంగుళూర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీల తరుఫున ఆడాడు ఈ వెస్టిండీస్ ప్లేయర్.