పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. యావత్ దేశం మొత్తం ఈ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రారంభం కానున్న వేళ ఆర్జేడీ నాయకుడు సునీల్ సింగ్ రాష్ట్రంలోని ఎన్నికల అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి నిరసనలు, అల్లర్లు పెద్ద ఎత్తున బీహార్‌లో జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొన్న అధికారులందరూ ప్రజా తీర్పును దెబ్బతీయవద్దని కోరారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని సూచించారు.
►ALSO READ | టార్గెట్ డిసెంబర్ 6.. 6 చోట్ల పేలుళ్లకు కుట్ర.. కదులుతున్న ఎర్రకోట బాంబు పేలుడు డొంక...
మహఘట్ బంధన్ కూటమి 140 నుంచి 160 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తేజస్వి యాదవ్ నాయకత్వంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏవైనా అవకతవకలు జరిగితే వాటిని ఎదుర్కోవడానికి పార్టీ అప్రమత్తంగా, సంసిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కామెంట్స్ చేశారని సునీల్ సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
