పైసలు అంత ఎక్కువయినయా..? పెళ్లి బారాత్లో గాల్లోకి డబ్బులు చల్లుతూ రచ్చ లేపిన కుర్రాళ్లు !

పైసలు అంత ఎక్కువయినయా..? పెళ్లి బారాత్లో గాల్లోకి డబ్బులు చల్లుతూ రచ్చ లేపిన కుర్రాళ్లు !

ఉత్తర ప్రదేశ్లోని ఫరూఖాబాద్‌ బాద్‌పూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి జరిగిన పెళ్లి బారాత్లో కుర్రాళ్లు నానా రచ్చ చేశారు. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవాస్ వికాస్ కాలనీలోని ఒక అతిథి గృహానికి పెళ్లి ఊరేగింపు వెళుతుండగా.. పెళ్లి బృందంలోని కొందరు కుర్రాళ్లు.. ఒక జిప్సీ కారు పైకెక్కి కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరేస్తూ.. రోడ్డు పైకి వెదజల్లారు. దారిన వెళ్ళే వారు ఆ నోట్ల కోసం ఎగబడటంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి ఇంటర్ నెట్లో అప్ లోడ్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో ఆ ప్రాంతంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

వైరల్ వీడియోలో కనిపిస్తున్న వాహన రిజిస్ట్రేషన్ నంబర్ గురించి ఆరా తీస్తున్నామని.. ఖాద్రీ గేట్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ కపిల్ చౌదరి గురువారం ఉదయం తెలిపారు. రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకుని, రోడ్డుపై న్యూసెన్స్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీడియోలో ట్రాఫిక్ జామ్ అయినట్లు కనిపించడం లేదని, ట్రాఫిక్ జామ్‌కు సంబంధించిన మరే ఇతర వీడియో అందుబాటులో లేదని కూడా ఆయన తెలిపారు.