యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి గురువారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా సమగ్రాభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏపీలోని వైజాగ్ అనురాగ్ జయంతి స్వస్థలం కాగా భోదన్, ఖమ్మం సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సిరిసిల్ల కలెక్టర్‌గా విధులు నిర్వహించిన ఆయన ఖైరతాబాద్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్గా పనిచేశారు.
అడిషనల్ కలెక్టర్‌గా వెంకారెడ్డి
యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ)గా కే. వెంకారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు శేరి లింగంపల్లిలో డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై యాదాద్రి జిల్లాకు వచ్చారు. ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై ఆయన రివ్యూ నిర్వహించారు.
