దేవరకొండలో  తాళం వేసిన ఇంటిలో చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్ట్

దేవరకొండలో  తాళం వేసిన ఇంటిలో చోరీకి పాల్పడ్డ దొంగ అరెస్ట్
  • నిందితుడి వద్ద రూ. 50 వేల స్వాధీనం 

దేవరకొండ(కొండమల్లేపల్లి) వెలుగు:  తాళం వేసిన ఇంటిలో చోరీకి పాల్పడ్డ దొంగను కొండమల్లేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం..  నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని వాసవి బజార్ కు చెందిన కనుమూరి నాగరాజు జనవరి 12 సాయంత్రం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అనంతరం వచ్చి చూడగా ఇంట్లో దొంగతనం జరిగి రూ. 67 వేలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో  ఫిర్యాదు చేశారు.

ఎస్సై అజ్మీరా రమేశ్  గురువారం ఉదయం స్థానిక చౌరస్తాలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వాసవి బజార్ కు చెందిన ఎస్కే బాబా పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించారు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో అతడి వద్ద రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కేసును ఛేదించిన కొండమల్లేపల్లి ఎస్సై రమేశ్, సిబ్బంది హేము నాయక్, భాస్కర్ ను అభినందించి, రివార్డ్ అందజేసినట్లు డీఎస్పీ తెలిపారు.