గోడపై పోస్టర్ వెనుక ఉన్న తీవ్రవాద కుట్రని కనిపేట్టిన ఐపీఎస్ ఆఫీసర్... ఎవరు ఈ సందీప్ చక్రవర్తి!

 గోడపై పోస్టర్ వెనుక ఉన్న తీవ్రవాద కుట్రని కనిపేట్టిన ఐపీఎస్ ఆఫీసర్... ఎవరు ఈ  సందీప్ చక్రవర్తి!

శ్రీనగర్‌లోని నౌగామ్ బన్పియోరా వీధుల్లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించిన అనుమానాస్పద పోస్టర్లను చాలామంది పట్టించుకోలేదు. కానీ ఎస్ఎస్పీ (SSP) జి.వి. సందీప్ చక్రవర్తికి అవి సాధారణ పోస్టర్లుగా అనిపించకపోవడంతో వాటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని వెంటనే  గుర్తించారు. దింతో ఆయన వేగంగా దర్యాప్తుకు ఆదేశించి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ముగ్గురు వ్యక్తులను గుర్తించి విచారించగా, స్థానిక ఇమామ్ అయిన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటపడింది.

పోలీసులు అహ్మద్ ఇంటిని సోదా చేయగా, అతని ఇంట్లో ఉన్న డిజిటల్ పరికరాల ద్వారా  పెద్ద ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు బయటపడ్డాయి. ఈ సమాచారం ఆధారంగా, ఓ  ప్రత్యేక బృందం హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఒక మెడికల్ కాలేజీలో  పనిచేస్తున్న పుల్వామాకు చెందిన  డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్టు చేసింది. దీని తరువాత  జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదానికీ సంబంధించిన చాల మంది కాశ్మీరీ డాక్టర్లు, ఇతరులను అరెస్టు చేశారు. ఈ  దర్యాప్తులో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్ కూడా దొరికాయి.  చాలా మందికి సాధారణ పోస్టర్‌లగా అనిపించిన చివరికి దేశ రాజధానిని భయభ్రాంతులకు గురిచేయడానికి ఒక పెద్ద నెట్‌వర్క్ ప్లాన్  వేస్తున్నట్లు వెల్లడించింది.

SSP చక్రవర్తి ఎవరు?
జి.వి. సందీప్ చక్రవర్తికి అద్భుతమైన కెరీర్‌ ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో ఒక ఉగ్రవాద నెట్‌వర్క్‌ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అత్యంత గౌరవనీయమైన పోలీసు అధికారి. ఆయన వైద్య కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి డాక్టర్ జి.వి.రామ గోపాల్ రావు రిటైర్డ్ ప్రభుత్వ వైద్యుడు, తల్లి పి.సి.రంగమ్మ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. గతంలో ఆయన  'ఆపరేషన్ మహాదేవ్'లో భాగంగా పహల్గామ్ దాడి చేసిన ముగ్గురిని  మట్టుబెట్టిన జమ్మూ & కాశ్మీర్ పోలీసు బృందానికి నాయకత్వం వహించారు.

►ALSO READ | ఇండియా, ఆప్ఘాన్ రెండు దేశాలతో ఒకేసారి యుద్ధానికి పాక్ సిద్ధం: పాక్ రక్షణ మంత్రి

అతని సర్వీస్ రికార్డ్స్ చూస్తే : 
SDPO - ఊరి అండ్ ఒపోర్: సున్నితమైన ప్రాంతాలలో ఫ్రంట్‌లైన్ పోలీసింగ్‌ను నిర్వహణ చేసారు.
SP ఆపరేషన్స్ - బారాముల్లా: 
SSP (సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) - దక్షిణ శ్రీనగర్, హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్.
AIG (అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్) సివిల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్: ఇంటర్నల్ పోలీసు వ్యవహారాలు, క్రమశిక్షణ, నిఘా పర్యవేక్షణ