శార్దుల్ తిరిగొచ్చాడు: లక్నో నుంచి స్టార్ ఆల్ రౌండర్‎ను కొనేసిన ముంబై

శార్దుల్ తిరిగొచ్చాడు: లక్నో నుంచి స్టార్ ఆల్ రౌండర్‎ను కొనేసిన ముంబై

ముంబై: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్‎ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. వేలానికి ముందే ట్రేడ్ డీల్‎లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి రూ.2 కోట్లకు దక్కించుకుంది. దీంతో ముంబైకి చెందిన ఈ ఆల్ రౌండర్ తిరిగి తన హోమ్ టీమ్ తరుఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు గురువారం (నవంబర్ 13) ఐపీఎల్ ఒక ప్రకటన చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే సీజన్‎లో ముంబై ఇండియన్స్‎కు ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. ఈ మేరకు ముంబై, లక్నో జట్ల మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందని వెల్లడించింది. 

కాగా, గతేడాది జరిగిన మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‎ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేయలేదు. దీంతో అన్ సోల్డ్ ప్లేయర్‎గా మిగిలిపోయాడు. అయితే.. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో రూ.2 కోట్లకు శార్దూల్‌ను లక్నో జట్టులోకి తీసుకుంది. లక్నో తరుఫున10 మ్యాచ్‌లు ఆడిన శార్దూల్ 13 వికెట్లు తీశాడు. 

►ALSO READ | RCB నుంచి ఐదుగురు ఔట్.. స్టార్ పేసర్‎కు కూడా డిఫెండింగ్ ఛాంపియన్ గుడ్ బై..?

బ్యాటింగ్‎లో కూడా రాణించాడు. కానీ.. వచ్చే సీజన్ కోసం లక్నో ఒక ప్రీమియర్ ఓవర్సీస్ ఆల్ రౌండర్ కోసం వెతుకుతోంది. ఇందులో భాగంగానే శార్ధుల్‎ను ముంబైకు అమ్మేసింది. మొదట అర్జున్ టెండూల్కర్‌ను లక్నోకు ఇచ్చి.. ముంబై శార్దూల్‌ను తీసుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ, ముంబై ప్లేయర్ టూ ప్లేయర్ ట్రేడ్ కాకుండా క్యాష్ ట్రేడ్‌‌‌కు మొగ్గు చూపింది.