గిరిజా ఓక్.. (Girija Oak) ఈ మరాఠీ నటి ఇప్పుడు ట్రెండింగ్.. వైరల్. ఇటీవల బ్లూ శారీలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ.. ఇప్పుడు ఇంటర్నెట్ను కుదిపేస్తుంది. ఎప్పుడు ఎవర్ని ఎలా ట్రోల్ చేస్తారో.. ఎలా వైరల్ అవుతుందో ఈ ఒక్క ఫొటో చాలు.. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన గిరిజా ఓక్.. ‘ఇంటర్వ్యూలో ఆమె ధరించిన చీర.. ఆమె అందంతో’ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఈ గిరిజా ఓక్ ఇవాళ నిన్నా వచ్చిన నటి కాదు.. 20 ఏళ్లుగా సినిమాల్లో.. టీవీల్లో.. సీరియల్స్లో నటిస్తూనే ఉంది. కాకపోతే ఇంత అందంగా ఎప్పుడూ కనిపించలేదు నెటిజన్లకు.. అందుకే ఒక్కసారి హాట్ హాట్ టాపిక్ అయిపోయింది.
అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ మూవీలో జబీన్ పాత్రలో నటించింది ఈ గిరిజా ఓకే. అయితే, తారే జమీన్ గుర్తు ఉండకపోవచ్చు. టీవీల్లో వచ్చే క్రైం ఇన్వెస్టిగేషన్ సీరియల్ CID అందరూ చూసి ఉంటారు కదా.. అందులో చాలా ఎపిసోడ్స్లో స్వప్న పాత్రలో కనిపించింది. అంతెందుకు నిన్నకాక మొన్న నెట్ ఫ్లిక్స్లో వచ్చిన 'ఇన్ స్పెక్టర్ జండే' సినిమాలో 'విజయ జండే' పాత్రలో నటించింది కూడా ఈ గిరిజా ఓక్ నే.. ఆమె వయస్సు 37 ఏళ్లు.. 20 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉంది.
ఇప్పటికే సినిమాలు, సీనియర్స్, టీవీ అండ్ వెబ్ సిరీస్లు చాలానే చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇప్పుడు ఆమె.. ఈ బ్లూ కలర్ చీరలో.. ఎంతో హుందాగా.. ఎంతో బ్యూటీగా.. బబ్లీగా కనిపించటం.. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విధానం.. ఆమె మాటలు అందర్నీ ఆకర్షించాయి. అంతే ఒక్కసారిగా.. ఈ 20 ఏళ్లుగా రాని పబ్లిసిటీ.. పాపులారిటీ వచ్చేసింది.. ఇప్పటి వరకు తెలియనోళ్లకు గిరిజా ఓక్ అనే నటి ఉంది అని తెలిస్తే.. తెలిసినోళ్లు మాత్రం ఈ నటి ఇంత అందంగా ఉందా అని నోరెళ్లబెట్టారు..
లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి గిరిజా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. " 'కాంతార 1'లో విలన్ గా నటించిన గుల్షన్ దేవయ్య అందరికీ గుర్తు ఉన్నాడుగా.." అతనితో ఓ రొమాంటిక్ సీన్స్లో నటించడం చాలా కంపార్ట్బుల్ అని చెప్పి షాక్ ఇచ్చింది. థెరఫీ షెరఫీ అనే సినిమాలో నటించింది.
ఇందులో భాగంగా గుల్షన్ దేవయ్యతో చేసిన ఓ రొమాంటిక్ సీన్ విశేషాలు పంచుకుంది. ‘రోమాంటిక్ సీన్ చేస్తున్నప్పుడు నువ్వు ఓకేనా అని 17 సార్లు తనని అడిగాడని, అలాంటి యాక్టర్స్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉంటుందని’ గిరిజా చెప్పుకొచ్చింది. ఇపుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. అందులో తాను మాట్లాడేటపుడు ఇచ్చిన ఎక్సప్రెషన్స్ నెటిజన్లకు తెగ కనెక్ట్ అయ్యాయి.
గిరిజా ఓక్.. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కూడా నటించింది. షోర్ ఇన్ ది సిటీ అనే హిందీ మూవీలో నటించింది. అప్పట్లో ఇందులో సందీప్ కిషన్‌తో గిరిజ చేసిన రొమాంటిక్ సీన్ బాగా వైరల్ అయింది. బాలీవుడ్‌లో 'తారే జమీన్ పర్' ఈమె మొదటి చిత్రం. ఇందులో చిన్న రోల్ చేసినప్పటికీ ఫేమ్ సంపాదించింది. తర్వాత సొంత భాష మరాఠీతో పాటు హిందీలోనూ షోర్ ఇన్ ద సిటీ (2010), కాలా, జవాన్ (2023) చిత్రాలు చేసింది.
గిరిజా ఓక్ ఫ్యామిలీ & సినిమా విషయాలకి వస్తే..
గిరిజా ఓక్ తండ్రి 'గిరీష్ ఓకే' కూడా సినిమా రంగానికి చెందినవాడే. ఆమె తన డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సినీ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్స్ తో స్టార్ట్ చేసిన తన కెరీర్.. బుల్లితెర, ఆ తర్వాత వెండితెరతో పాపులర్ అయింది. 2011లో సుహ్రుద్ గోడ్బోలే అనే దర్శక నిర్మాతని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు కూడా ఉన్నాడు.
ఫస్ట్ గిరిజాకి.. 'C.I.D' సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'లేడీస్ స్పెషల్', 'మోడ్రన్ లవ్', 'కర్టెల్' వంటి సీరియల్స్, టీవీ షోల్లో నటించింది. దాంతో సినిమా అవకాశాలు వరుసబెట్టి వచ్చాయి. 2004లో 'మనిని' అనే మరాఠీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్‌లో 'తారే జమీన్ పర్' చేసింది. ఇన్నాళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా కూడా రాని గుర్తింపు.. కేవలం ఒక్క ఇంటర్వ్యూతో ట్రెండింగ్ లోకి వచ్చింది.
ఇలా 37 ఏళ్ల వయసులో సోషల్ మీడియాలో వైరల్ అవుతానని ఈమె కూడా అనుకుని ఉండదేమో? సో.. ఒక సినిమాలో చెప్పినట్లుగా.. "సక్సెస్ అనేది స్విగ్గీలో పెట్టిన ఆర్డర్ కాదు.. వెంటనే రావడానికి. కొంచెం టైం పడుతుంది". అలా గిరిజా ఓక్ టైం అభి ఆగాయా.. ఇక ముందు అంతా అవకాశాలే!!
