రోడ్డెక్కిన అన్నదాతలు..వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

రోడ్డెక్కిన అన్నదాతలు..వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కోనుగోళ్లపై ఎక్కడికక్కడ నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పలు జిల్లాలో రైతులు రోడ్కెకి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లా: మంథని వ్యవసాయ మార్కెట్ ముందు మంథని -పెద్దపల్లి ప్రధాన రహదారిపై రైతుల ధర్నా దిగారు. వడ్లు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు  రైతులు. రహదారిపై ధాన్యం పోసి నిప్పు అంటించి దహనం చేశారు. కటింగ్ లేకుండా వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేశారు. రైతులు రోడ్డుపై బైటాయించడంతో భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్ జాం అయ్యింది. ఈ క్రమంలో ధర్నా వద్దకు వచ్చిన తహసిల్దార్ బండి ప్రకాష్ . కాంట పెట్టిస్తామని హామీ ఇచ్చారు. తహసిల్దార్ హామీతో ధర్నా విరమించారు రైతులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వాపురం మండలం మొండికుంటలో ధాన్యం కొనుగోలు చేయట్లేదని రోడ్డెక్కారు రైతన్నలు.. రోడ్డుపై ధర్నా  చేసి రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయిన ట్రాఫిక్ అయ్యింది. రైతుల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే రేగా డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

మెదక్ జిల్లా : తూప్రాన్ పట్టణంలో రైతుల ఆందోళన చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడం లేదంటూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం కాల్చివేసి నిరసన తెలిపారు. జిల్లా మరో చోట చేగుంట మండలం మక్కరాజ్ పేట్ లో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లేదని ఆందోళన చేయడంతో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ప్రధాన రహదారిపై రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వడ్ల సంచులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతుల డిమాండ్ చేశారు.