- దూసుకొచ్చిన బెంజి కారు
- యువకుడు మృతి
మాదాపూర్, వెలుగు: బెంజ్ కారు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. న్యూ హఫీజ్‌పేట్ ఆదిత్య నగర్‌కు చెందిన శ్యామ్ రాజ్(28) కుటుంబంతో కలిసి ఘట్‌కేసర్‌లో నివసిస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున తన భార్య సహజ్‌తో కలిసి బైక్‌పై కేబుల్ బ్రిడ్జిపైకి వచ్చాడు. అక్కడ ఫొటోలు తీసుకుంటున్న సమయంలో జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్తున్న బెంజ్ కారు వెనక నుంచి శ్యామ్ రాజ్‌ను ఢీకొట్టింది.
హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తుండా సాయంత్రం మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు కలకత్తాలోని క్వాంటం మినరల్స్ అండ్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.

