V6 News

బ్రేకింగ్.. మియాపూర్ బాలిక హత్యకేసులో తండ్రే నిందితుడు

బ్రేకింగ్.. మియాపూర్ బాలిక హత్యకేసులో తండ్రే నిందితుడు


మియాపూర్ లో కలకలం రేపిన బాలిక అనుమానాస్పద మృతి కేసును మియాపూర్ పోలీసులు చేధించారు. నాలుగు పోలీసు బృందాలతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. బాలిక వసంత(12) మర్డర్ కేసులో ఆమె తండ్రి నరేష్ నిందితుడని తేల్చారు పోలీసులు. 

మియాపూర్   ఏసీపీ నరసింహ్మా రావు బాలిక హత్యకేసు వివరాలు వెల్లడించారు.  సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం  వారం రోజుల తర్వాత  బాలిక మిస్సింగ్ మిస్టరీ వీడింది. తండ్రిపై అనుమానంతో తమదైన తీరులో పోలీసుల దర్యాప్తు చేశారు. పోర్న్ వీడియోలు చూడడం, మద్యపానానికి బానిసైన బాలిక తండ్రి బానోతు నరేష్.. తన కోరిక తీర్చాలంటూ బాలికపై  తండ్రి నరేష్ ఒత్తిడి తెచ్చాడు.  అమ్మకు చెప్తానని బాలిక గట్టిగా అరవడంతో కోపంతో కన్న కూతురిని హత మార్చాడు తండ్రి నరేష్. నడిగడ్డ తండా సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి అనంతరం బాండ రాయితో  కొట్టి హత్య చేశాడు.  బాలికను హతమార్చి నిర్మానుష్య ప్రాంతం నుండి బయటకు వచ్చాడు  బాలిక తండ్రి నరేష్.

11 నిమిషాల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు తండ్రి నరేష్.  అనంతరం అక్కడి నుండి బయటకు వచ్చాడు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి నిర్దారించుకున్నాడు. వరుసగా మూడు రోజుల పాటు బాలిక మృతదేహాన్ని చూడడానికి హత్య చేసిన ప్రదేశం వెళ్లి వచ్చాడు. హత్య చేసిన రోజే తన కూతురు మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు నరేష్ దంపతులు. వారం రోజుల పాటు అస్సలు విషయం చెప్పకుండా నటించాడు బాలిక తండ్రి నరేష్. 
బాలిక తండ్రి నరేష్ హత్య చేసినట్లుగా పోలీసుల నిర్దారణకు వచ్చారు.

బాలిక తల్లిదండ్రులది  స్వగ్రామం మహబూబబాద్ జిల్లా మర్రిపెడ మండల్ ఎల్లంపేట్ గ్రామం లక్ష్మన్ తండా. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ మియాపూర్ లోని నడిగడ్డ తండాకు వలస వచ్చారు నరేష్ దంపతులు. వచ్చిన 15 రోజులకే జూన్ 7న  కన్న కూతురును హత్య చేశాడు తండ్రి నరేష్. నాలుగు బృందాలతో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు... సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.