అధికారుల నిర్లక్ష్యం: ఓటర్ పేరు ‘టట’ s/o ‘రర’

అధికారుల నిర్లక్ష్యం: ఓటర్ పేరు ‘టట’  s/o ‘రర’

హైదరాబాద్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. ఇప్పటికే పలువురి పేర్లు తప్పుగా నమోదవడంతో దిద్దుబాటుచర్యకు పూనుకున్నారు అధికారులు. అయినా కొందరి పేర్లలో అవే తప్పులు దొర్లుతున్నాయి. రంగా రెడ్డి జిల్లా, షాద్ నగర్ మున్సిపాలిటీలోని  ఒక ఓటర్ పేరు ‘టట’  అని తండ్రి పేరు దగ్గర ‘రర’ అని నమోదైంది. దీంతో స్థానికులు మున్సిపల్ అధికారులపై కోపం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ కాకుండా ఇంకా చాలా మంది పేర్లలో కూడా తప్పులు నమోదైనట్లుగా చెప్పారు. కొంత కాలంగా ఓటర్ల జాబితాను సరిచేస్తున్నామని చెప్పినా ఇంకా తప్పులు రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు.